Monday , July 22 2024

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పుర్ర నర్సింలు.

తెలంగాణ కెరటం :

రాయపోల్ ప్రతినిధి :మార్చ్ 28

ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుర్ర నర్సింలు మాదిగను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ (మాదిగ రాజకీయ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షులు బి. ఎన్ రమేష్ కుమార్ మాదిగ తెలిపారు.
ఈ సందర్భంగా నర్సింలు కు గురువారం హైదరాబాద్ లో నియామక పత్రంను అందజేశారు.అనంతరం పుఱ్ఱ నర్సింలు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎమ్మార్పీఎస్ లో పనిచేసిన తనను గుర్తించి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ కుమార్ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నా పైన ఉంచిన నమ్మకాన్ని బాధ్యతతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోతానని ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలందర్ని ఏకతాటి తెచ్చి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు.