Wednesday , July 24 2024

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి*

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం

తెలంగాణ కెరటం: దౌల్తాబాద్ /రాయపోల్: ప్రతినిధిమార్చి 27

గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి
రాయపోల్.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ సూరంపల్లి గ్రామాల్లో తొగుటసీఐ లతీఫ్. దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రదీప్.కేంద్రభాగాలతో గ్రామాల్లోసిఐ ఆధ్వర్యంపోలీస్ లుగ్రామంలో ప్రతి గల్లీకి తిరిగి కవత్తు నిర్వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
లోక్ సభ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును
వినియోగించుకోవాలని సూచించారు, ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తెలిపినారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేద డయల్ 100 కాల్ చేయాలని చేసి సూచించారు. మద్యానికి డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరిగినది,
గ్రామాలలో ఏ పార్టీ వారు వచ్చి ప్రచారం చేసిన అడ్డుకోవద్దని ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తికి ఓటు వేయండి కానీ ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు. ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర బలగాలు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.