–గురుకుల ఉపాధ్యాయులుగా మండల యువకులు
.తెలంగాణ కెరటం:
రాయపోల్ /దౌల్తాబాద్ ప్రతినిధి:మార్చి6
కాలాన్ని ఆయుధంగా మార్చుకొని లక్ష్య సాధనలో విజయ తీరాలకు చేరారు. వారి పట్టుదల ముందు పేదరికం తలవంచక తప్పలేదు. వారి దృఢ సంకల్పం , అలుపెరుగని శ్రమ విజయం ముంగిట నిలిచేలా చేసాయి. మారుమూల ప్రాంతం నుంచి గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగం సంపాదించి తమ సత్త చాటారు.
దౌల్తాబాద్ మండలం మల్లేశం పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శౌరిపూర్ గ్రామానికి చెందిన చెన్న రాజు తెలుగు (టీజీటీ ) ఉపాధ్యాయునిగా ఎంపిక అయ్యాడు. చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. ప్రాథమిక విద్య శౌరిపూర్ లో పూర్తి చేయగా, తరువాత సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల లో 10 వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ సిద్దిపేట లోనే పూర్తి చేసాడు. అనంతరం బి ఎడ్ నాగార్జున సాగర్ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల లో, ఏం ఎ తెలుగు కాకతీయ యూనివర్సిటీ లో పూర్తి చేసాడు. గతంలో సాహిత్య రంగంలో సురువు అనే కవిత సంకలనం ప్రచురించాడు. కుటుంబ పోషణ కోసం ప్రముఖ దిన పత్రికలో
జర్నలిస్ట్ గా పని చేసాడు. వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న లక్ష్య సాధన కోసం రెండు సంవత్సరాలనుండి కుటుంబానికి దూరంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అయ్యాడు. ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయ ఫలితాలలో తెలుగు ఉపాధ్యాయినిగా ఎంపిక అయ్యాడు. ఎన్నో ఇబ్బందులు అదిగమించి అనుకున్న లక్ష్యన్ని సాధించిన చెన్న రాజుకు మండల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు అభినందనలు తెలిపి అభినందించారు.
జేయల్ గా తిర్మలాపూర్ యువకుడు :
దౌల్తాబాద్ మండల పరిధిలో తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నిరుడి నరేష్ గురుకుల ఉద్యోగా నియామకాల్లో జూనియర్ లెక్చరర్ ఎంపిక అయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నరేష్ 10 వ తరగతి వరకు తిర్మలాపూర్ జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో, ఇంటర్ గజ్వెల్ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసాడు. డిగ్రీ సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో, పీజీ సైపబాద్ సైన్స్ కళాశాలలో పూర్తి చేసాడు. ఇటీవల వెలువడిన గురుకుల నియామక ఫలితల్లో జూనియర్ లెక్చరర్ గా ఎంపిక అయ్యాడు. మెదక్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ బోధన ఉపాధ్యాయునిగా పని చేస్తూనే నరేష్ ఉద్యోగం సాధించడం విశేషం. కాగా నరేష్ ను గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు పలువురు అభినందనలు తిలిపారు.