Monday , July 22 2024

నేటి నుండి శ్రీ శ్రీ శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఉత్సవాలు.

ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం

ఎత్తయిన గుట్టపై వెలసిన ఆలయం.

  • మూడు రోజులపాటు శివరాత్రి జాతర ఉత్సవాలు

వివిధ మండలాల నుండి భారీగా తరలి రానున్న భక్తులు

– ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ .

తెలంగాణ కెరటం :రాయపోల్ /దౌల్తాబాద్ ప్రతినిధి :
మార్చి 6

మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శంభు లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందంగా ముస్తాబు చేశారు. మూడు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయంలోని విగ్రహాలను రంగురంగులతో అలంకరించారు. ఎత్తైన గుట్టపై స్వయంభుగా వెలసిన శంభు లింగేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధిగాంచాడు. ప్రతి సంవత్సరం శివరాత్రికి మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ప్రతి ఏటా చేగుంట, గజ్వేల్,సిద్దిపేట, రాయపోల్, తోగుట,మిరుదొడ్డి,రామాయంపేట, హైదరాబాద్ తదితర మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. భక్తుల సౌకర్యం ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఉత్సవాలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి,యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. వీరితోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ప్రముఖ కళాకారులు అంజన్న ఆకునూరు దేవన్న,
అమూల్యస్తుడు వేణు గజ్వేల్ నక్క శ్రీకాంత్, కమ్మరి తిరుపతి, ఆర్కెస్ట్రా నాగలక్ష్మి, సింగర్ ముకుంద హాజరుకానున్నారు. 7న ఉదయం 10 గంటలకు భక్త బృందంతో భజన కీర్తనలు, 8న అఖండ దీపారాధన గణపతి పూజ, గ్రామదేవతలకు పూజలు, ఆరాధన, ఉమామహేశ్వరి స్వామి కళ్యాణం, ఒడిబియ్యం సేకరించుట, మంగళ వాయిద్యాలతో స్వామివారి ఎదుర్కోలు, ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి శంభు దేవుని గుట్ట వరకు హోమగుంట ప్రతిష్ట, 9న మూడో రోజు అగ్నిగుండాలు బలిహారం, భక్తులు అగ్నిగుండం తొక్కుట,బండ్ల ఊరేగింపు, జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ తెలిపారు.

*అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్. శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి వసతిని ఏర్పాటు చేశాం భక్తుల తాకిడి ఈసారి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అందుకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు కల్పించామని ఆది వేణుగోపాల్ అన్నారు.