Tuesday , July 16 2024

నిండు జీవితానికి పోలియో రెండు చుక్కలు

పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి

ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్

తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి:మార్చి 03

నేటి పిల్లలే రేపటి భావిభారత పౌరులనీ, 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని, ఆరోగ్యవంతమైన జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరనీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. రాయపోల్ మండల కేంద్రంలోని గ్రామ చావిడి వద్ద కమ్యూనిటీ హాల్ వద్ద ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మొదటిరోజు ఎవరైనా వేయించకుంటే రెండవ రోజు ఏఎన్ఎం, ఆశ వర్కర్ హెల్త్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను అందజేస్తారని తెలిపారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు సహకరించి పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో. రాయపోల్ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ బల్ల మహారాజ్ ,ఏఎన్ఎం మాధవి, ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్ రెడ్డి, ఆయుష్ ఫార్మసిస్ట్ బ్యాగరిలింగం గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్,అంగన్వాడి టీచర్లు రేఖ ,ఆగమ్మ ,పద్మ, జయ ,ఆశ వర్కర్లు యాదమ్మ, భాగ్యలక్ష్మి, రజిత, మాజీ వార్డు సభ్యులు గల్వ దయాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.