Monday , September 16 2024

విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ

తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి: ఫిబ్రవరి 21

విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను సక్రమంగా విని 10వ తరగతి విద్యార్థులు పది పరీక్షల్లో 10/10 సాధించి పాఠశాలలను జిల్లాలో ముందంజలో ఉంచి 100% ఉత్తీర్ణత సాధించాలని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండలంలోని రాంసాగర్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు నిర్వర్తించే బాధ్యతలను విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా బోధించడం వలన వారిలో క్రమశిక్షణ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించబడతాయని చెప్పారు. ఉత్తమంగా బోధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందించడం జరిగింది. స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారగా ఈ కార్యక్రమంలో డీఈఓగా అనుష, ప్రధానోపాధ్యాయులుగా పి.అఖిల, ఎంఈఓగా బి.అనూష, డిప్యూటీ డీఈవోగా పి.శ్రావణి, ఎంఎన్ఓగా కే.అనుష సీఈవోగా కావ్య, ఎస్ఓ అర్చన, ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు వై.గోవర్ధన్, రాజ్ కుమార్, నరేందర్ రెడ్డి, కిషన్, సావిత్రి, సవిత, ఈశ్వర్, పిటి అనిఫ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.