Thursday , May 23 2024

రాయపోల్ జోరుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటిప్రచారం

తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి: మే 10

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం గురువారం రాత్రినిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ సీనియర్ నాయకుడుకిష్టారెడ్డి.పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసమే ఇంటింటి ప్రచారం గురువారం రాత్రినిర్వహించడం జరిగిందని అన్నారు. ఏ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు చేతిగుర్తుకు ఓటు వేస్తామని నీలం మదన్నకు అండగా నిలుస్తామని అంటున్నారని. బిజెపి పార్టీ. బిఆర్ఎస్ పార్టీ.ప్రజలు నమ్మే స్థితిలో లేరని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫై ప్రజలు ఉన్నారని అన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని బిసి సామాజిక వర్గానికి చెందిన నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల బీసీ సెల్ అధ్యక్షుడు అందిపూర్ నర్సాగౌడ్. గ్రామ అధ్యక్షుడు గడ్డి వెంకటరెడ్డి. రాయపోల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి సాజిద్.గ్రామ యూత్ అధ్యక్షుడు సమ్మర్ విగ్నేష్. కొంగరి శ్రీనివాస్. కొంగరి స్వామి. గడ్డమీది దుర్గయ్య .జిల్లారాజు.నరసింహారెడ్డి.జనార్దన్ రెడ్డి.తదితరులు పాల్గొన్నారు.