–రాయపోల్ బిజెపి మండల అధ్యక్షులు రాజాగారి రాజా గౌడ్.
తెలంగాణ కెరటం రాయపోల్ ప్రతినిధి ఏప్రిల్ 28
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని రాయపోల్ బిజెపి మండల అధ్యక్షులు రాజాగారి రాజా గౌడ్ అన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం బిజెపి పార్టీకి పట్టం కడుతున్నారని మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయం అన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రఘునందన్ రావు నువ్వు గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పదవుల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు మారడం జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉండి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో రైతులను అరిగోసలు పెట్టి అక్రమంగా భూములు లాక్కొని నట్టేట ముంచిన ఘనత వెంకటరామిరెడ్డి అన్నారు. అలాంటి అభ్యర్థులకు ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తే మెదక్ నియోజకవర్గాన్ని తాకట్టు పెడతారని మండిపడ్డారు. రఘునందన్ రావు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజిరడ్డి , రామ్ సాగర్ ఉపసర్పంచ్ రాజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు నీల స్వామి, కృష్ణ గౌడ్, ఓబీసీ మండలాధ్యక్షులు స్వామి, నాయకులు కృష్ణ, సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.