Tuesday , July 16 2024

ఇఫ్తార్ విందులో పాల్గోన్న దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

-ముస్లిం సోదరులతో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

తెలంగాణ కెరటం:దౌల్తాబాద్ /రాయపోల్ ప్రతినిధి: ఏప్రిల్10

రంజాన్ పవిత్ర మాసం లో ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి రాయపోల్ మండలంలోని సయ్యద్ నగర్ లో ముస్లిం సోదరులకు ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లిం లు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసామన్నారు. రాబోయే రంజాన్ పండగని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాయపోల్ మండల అధ్యక్షుడు తప్పెట సుధాకర్ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుంచనకోట కృష్ణ గౌడ్ రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్ప మల్లేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డి సత్తు గారి తిరుపతిరెడ్డి రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సాజిద్ యువజన నాయకులు కొంగరి దయాకర్ దుర్గాప్రసాద్ మహేష్ పుర నర్సింలు రాయపూర్ గ్రామ అధ్యక్షులు విజ్ఞాన్ తుప్పత్తి ప్రవీణ్ తుడుం ప్రశాంత్ బాసం నరసింహారెడ్డి దేశమంతా రెడ్డి రాయపోల్ మాజీ సర్పంచ్ కమ్మరి శ్రీనివాస్ చారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.