Sunday , May 26 2024

దేశ రక్షణకు సైనికుల పాత్ర గొప్పది

సురక్షిత్ భారత్ ను నేలకొలపాలి

రిటైర్డ్ ఆర్మీ -నీల చంద్రం

తెలంగాణ కెరటం:దౌల్తాబాద్ /రాయపోల్ ప్రతినిధ:ఏప్రిల్ 10
దుబ్బాక అసెంబ్లీ పరిధిలో ఉన్న రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జవాన్ మహేష్ కుటుంబాన్ని కలిసి దేశ రక్షణకి సైనికులు అయితే ఆ సైనికుల యొక్క ప్రాణాలకి మోడీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు. అలాంటి మోడీ సర్కార్ని మరొకసారి అధికారంలోకి తేవడానికి వారి కుటుంబాల తరఫున కృషి చేయాలని రిటైర్డ్ ఆర్మీ జవానుగా నీల చంద్రం విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో గెలిచి ప్రజలను పాలించాలి కానీ,ధన బలముతో గెలిచి ప్రజలను దోచుకోవాలని చూడడం చాలా దురదృష్టకరమని రిటైర్డ్ ఆర్మీ చంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టం తెలిసిన వ్యక్తిగా పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపిస్తే ప్రజలకి సేవ చేస్తానని ప్రగద్బాలు పలికే మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం సిగ్గు చేటు అని తీవ్రంగా అక్షేపించారు. నిజంగా మీకు కనుక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంపై గౌరవం ఉన్నట్లయితే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి పోటిలో నుంచి తప్పుకోవాలని ఒక ప్రజాసానిక వాదిగా డిమాండ్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్గా మీరు మంచి పనులు చేసినట్లయితే ఎన్నికలు నియామలి అమల్లో ఉన్న సందర్భంలో ఏరకంగా ప్రభుత్వ ఉద్యోగులను సమకూర్చి వారి ద్వారా డబ్బులు పాంచాలి అని ఏ విదంగా చూస్తారో చెప్పాలి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ని అనుసరించి ఓటుకు నోట్ ఇచ్చి గెలవాలని చూడడం ఈ సభ్య సమాజానికి మంచిది కాదని ఈ విషయాన్ని సమాజంలో ఉన్న ప్రజాసామిక వాదులు అందరు ఖండించాలని కోరుతున్నాను. దాశరథి మహాకవి పేర్కొన్నట్లుగా “ఒక రాజును నిలబెట్టుటలో బలి అయినా నరకంట్టలెన్నో” వ్యాఖ్యలను గుర్తు చేసేటట్లుగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ కు కారణమై ఆ కుటుంబాలు మనోవేదనకు గురైయ్యేటట్లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్నెతలు అయినప్పటికీ కొంతమంది బి.ఆర్.ఎస్.రాజకీయ నాయకులు ఓట్ల బ్రోకర్లుగా మారి,ఓట్ల కొనుగోలు కార్యక్రమనికి పాల్పడుతున్నారని దీనిని సమాజంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి మేధావి వర్గం ఎప్పటికక్కడ ఖండించాలని రిటైర్డ్ ఆర్మీ చంద్రం తెలిపారు. జవాన్ కుటుంబాన్ని కలిసిన వారిలో లింగారెడ్డిపల్లి బిజెపి భూత్ ఆధ్యక్షులు యాదగిరి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.