Tuesday , July 16 2024

రాయపోల్ మండలాన్ని గజ్వేల్ రెవిన్యూ డివిజన్లోనే ఉంచాలి

మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం.

గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే.

నిర్లక్ష్యంగా వివరించే అధికారులపై చర్యలు తప్పువు

ఎంపీడీవో బాలయ్య..

అందరి సహకారంతో మండల అభివృద్ధి లక్ష్యం. ఎంపీపీ కల్లూరి అనిత.

జడ్పిటిసి యాదగిరి

తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి:ఫిబ్రవరి 16

ప్రజల ఆకాంక్ష మేరకు రాయపోల్ మండలాన్ని గజ్జూర్ రెవిన్యూ గజ్వేల్ రెవిన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని శుక్రవారం జరిగిన రాయపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీపీ అధ్యక్షురాలు కల్లూరి అనిత శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి. ఆయా గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల సమావేశంలో వివిధ శాఖ అధికారులు వారి వారి నివేదికలను సభ్యుల సమక్షంలో వివరించారు. ఈ క్రమంలోనే మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్ మాట్లాడుతూ రాయపోల్ మండల ప్రజలకు గజ్వేల్ రెవిన్యూ డివిజన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. అయితే రాయపోలు కూడా దుబ్బాక రెవిన్యూ డివిజన్ లో కలిపితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కష్టమవుతుందన్నారు. గజ్వేల్ పది కిలోమీటర్లు ఉండగా. దుబ్బాక 40 కిలోమీటర్లు ఉంటుందని ప్రజలకు గోస తప్ప మేలు కాదన్నారు. ఈ నేపథ్యంలో మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ రాయపోల్ మండలాన్ని గజ్వేల్ రెవిన్యూ డివిజన్లోనే ఉంచాలని సభ్యులందరూ తీర్మానం చేశారు. తమకు సమాచారం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వివరిస్తే ఊరుకునేది లేదని ప్రజా ప్రతినిధులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. కాగా మండల సమావేశం జరుగుతున్నప్పుడు పంచాయతీ కార్యదర్శులు తీసుకొని బయటకు వెళ్లడం పట్ల ఎంపీడీవో బాలయ్య వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం జరిగినంత సేపు ప్రతి అధికారి కచ్చితంగా సమావేశంలో ఉండాలని. ప్రతి మండల స్థాయి అధికారి సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీపీ అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా ప్రత్యేక అధికారులు ఇస్తా రాజ్యాంగ వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచుల పదవి కాలం పోయిందని ఉన్నది ఎంపీటీసీలు తానేనని ఈ విషయాన్ని మండల జిల్లా స్థాయి అధికారులు గ్రహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ మండల అధికారులు ప్రోటోకాల్ లభించారని ఇప్పటికైనా అది పద్ధతులు మార్చుకొని ఎన్నికల్లో గెలిచిన తమకు సముచితస్థానం కల్పించాలని. తమ వైపు నుంచి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో బాలయ్య. తాసిల్దార్ దివ్య. మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్. ఎంపీటీసీలు ఇట్లు వెంకటయ్య లక్ష్మి మండల విద్యాధికారి నర్సవ. పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ బల్ల మహారాజ్. అంగన్వాడి సూపర్వైజర్ షబానా. విద్యుత్ శాఖ ఏఈ నాగరాజు. వివిధ శాఖల అధికారులు ఆయా గ్రామాల ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.