Sunday , May 26 2024

కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మదాసు రాములు గౌడ్

తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి:ఫిబ్రవరి 16

టీపీసీసీ సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మకపల్లి గ్రామానికి చెందిన మాదసు రాములు గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అద్యక్షుడు మిద్దెల జితేందర్ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాములు గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవీ అప్పజెప్పినందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు . పది సంవత్సరాల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పాలనలో పేద ప్రజలకు ఓరగపేట్టిదేమి లేదని గ్రహించి ఇటీవల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తన ఎంపిక కు సహకరించిన డిసిసి అధ్యక్షులు తూంకుంటా నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అద్యక్షులు హనుమండ్లకాడి కిష్టారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు ..