Sunday , May 26 2024

పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ కెరటం సైదాపూర్ మండల్ ( జులై 9)

కరీంనగర్/సైదాపూర్, మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో 1990_1991లో జడ్పి హెచ్ ఎస్ లో పదవతరగతి చదివిన విద్యార్థులు ఆదివారం దుద్దెనపల్లి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆనందంగా నిర్వహించారు.అప్పుడు చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు.ఆట పాటల తో సంతోషంగా గడిపారు.డిగ్రీ చదువుతున్న రమ్య అనే విద్యార్థికి పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం చదువు చెప్పిన గురువులు మల్లారెడ్డి,రమణయ్య,ప్రభాకర్,సత్యనారాయణ రెడ్డి,కనుకయ్యలను,అటెండర్ కనుకయ్యలను శాలువాలతో సన్మానించారు. పారిశుద్ధ్య కార్మికులకు కొత్త దుస్తులు అంద జేశారు.ఈ కార్యక్రమం నిర్వహణ రమేశ్,సత్యనారాయణ,సదానందం మిత్రులు నిర్వహించారు.ఇక్కడ దుద్దెనపల్లి గ్రామ సర్పంచ్ తాటిపెల్లి యుగెందర్ రెడ్డి,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.