»»» స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడుదాం…..
— పిఓడబ్ల్యూ అనసూయ
తెలంగాణ కెరటం /మహబూబాబాద్ జిల్లా /కురవి /03–03–2023
దేశంలో పురుషాధిపత్యాన్ని స్త్రీరిస్తున్న మనువాదానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ప్రగతిల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొమ్మన బోయిన అనసూయక్క పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవంలో భాగంగా ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనంతరం కార్యక్రమమును ఉద్దేశించి కామ్రేడ్ అనసూయక్క మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదాన్ని పెంచి పోషించడం కోసం పురుషాధిపత్యాన్ని బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని అంతేకాకుండా దళిత గిరిజన మైనార్టీలపై మహిళలపై అత్యాచారాలు దాడులు హత్యలు పెరిగిపోతున్న వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విప్లమైందని ఆవేదన వ్యక్తం చేశారు స్త్రీ పురుష సమానత్వం కోసం మహిళలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ మంద పద్మక్క జిల్లా కోశాధికారి కామ్రేడ్ సామ రజిత మండల నాయకురాలు నాగరాణి అల్లి స్రవంతి సంధ్య ఉమా వెంకటమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.