Tuesday , July 16 2024

కల్తీ కల్లు తో ప్రాణాలు పోతేనే స్పందిస్తారా…?

కల్తీ కల్లు తో ప్రాణాలు పోతేనే స్పందిస్తారా…?

 • తనిఖీల పేరుతో కాలయాపన
  చేస్తున్న ఎక్సైజ్ శాఖ..
 • రెచ్చిపోతున్న కల్తీ కల్లు
  మాఫియా….?
 • యువత పెడదారి..?
 • చోద్యం చూస్తున్న ఎక్సైజ్
  అధికారులు..?
 • కల్లు కాదిది కాటికి పంపే
  రసాయనం..?
 • ఒక్కసారి రుచి చూశారో
  అంతే సంగతులు..?
 • అడ్డంగా సంపాదిస్తున్న
  అడ్డుకునే వారు కరువు..?
 • డమ్మీ లైసెన్సులతో కొత్త
  దుకాణాలు ప్రారంభం
 • ఇంత జరుగుతున్న ఎక్సైజ్
  చేతివాటం ఉందా..?
  -కల్తీకల్లు పై ప్రత్యేక కథనం.

తెలంగాణ కెరటం, రామారెడ్డి మండల ప్రతినిధి: మే 03

పురాణ కాలంలో దేవతలు సైతం మత్తును సేవించడానికి సురపానుకం అనే పదార్థాన్ని సేవించి మత్తును సేవిస్తారు అని మనం కథలలో పురాణాలలో వింటూ ఉండేవాళ్ళం అదేవిధంగా

పొద్దంతా పనిచేసి కాస్త అలసిన శరీరానికి విశ్రాంతి కొరకు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాతకాలంలో ఈత చెట్టు, తాటి చెట్టు,నుండి వచ్చే
సహజమైన కళ్ళుని సేవించి విశ్రాంతి పొందేవారు. అలా అలా కాలం మారుతున్న కొద్దీ దళారుల పుణ్యమా… వారి కాసుల పంట కొరకు కల్తీకల్లుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.. అనడంలో సందేహం లేదు..?

కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యాపారులు.ఇది కల్లు కాదు..కాటికి పంపే రసాయనం అని తెలియక చాలా మందికి ఈ కల్తీ కల్లుకు అలవాటు పడి అనారోగ్యానికి గురవుతుండగా,ఈ కల్తీ కల్లు వల్ల గతంలో పలువురు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. విచ్చలవిడిగా డిపోలు వారికి నచ్చిన విధంగా నచ్చిన చోట విడివిడిగా దండిగా సొమ్ము చేసుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఎవరికి వారే ముస్తేదారుల ముసుగులో కల్తీ కళ్ళును తయారు చేస్తూ విచ్చలవిడిగా ప్రజల
ప్రాణాలతో,చెలగాటమాడుతున్నారు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం లో పాటు పలు గ్రామాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతోంది.అదేవిధంగా ఏకంగా కొన్ని వేల లీటర్ల కల్తీ కల్లును ఏరులై పారిస్తున్నారు. ముఖ్యంగా కల్తీ కల్లు జోరుగా కొనసాగుతోంది..

అమాయకుల ప్రాణాలతో చెలగాటం…

కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యాపారులు. కార్మికులు,కూలీల కడుపులు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు.వింత మత్తును అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు.ఒల్లు గుళ్ల చేసి ఆస్పత్రుల చుట్టూ తిప్పిస్తున్నారు. రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో కేసుల నుంచి తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు.ఇంత జరుగుతున్నా ఏ నాయకుడు పట్టించుకోడు.ఏ అధికారి తనిఖీలు నిర్వహించరు..

మత్తు కోసం రసాయనాలు…

వ్యాపారులు మత్తు కోసం ఇందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు.అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు,మత్తు కోసం ఆల్ఫ్రోజోలం, డైజోఫాం,క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు.

దెబ్బతింటున్న ప్రజల ఆరోగ్యం…

అమ్మోనియం మిశ్రమ రసాయనాలు,సోడా యాష్, ఈస్ట్ , పంటలకు వాడే యూరియా, కొన్ని రకాల పెస్టిసైడ్ ను కూడా వాడుతున్నారు. అదేవిధంగా కుంకుడుకాయ రసం వాడుతున్నారు.దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.కళ్లు పోవడం,మెదడు సరిగ్గా పనిచేయకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గిపోవడం,మూత్రపిండాల వ్యాధులు,జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ప్రాణాలు సైతం పోతున్న ఘటనలు సంభవిస్తున్నాయి.

యువత పెడదారి

ఈ రోజుల్లో యువతకు చేతుల్లో సెల్ఫోన్, జల్సా కి బైక్, ఆ పార్టీలు ఈ పార్టీలు అంటూ జోరుగా దావతులు చేసుకోవడానికి ఆలోచిస్తున్న తరుణం ఇలాంటి యువత ఈ కల్తీ కళ్ళు మాఫియా వలన అలవాటు పడడం వలన సమాజం చిత్తుచిత్తుగా అవినీతిమయం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ నామ మాత్రపు తనిఖీలు..

వాస్తవానికి ఎక్సైజ్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తే కల్తీ కళ్ళు అంతమొందించవచ్చు. అదేవిధంగా తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అధికారికంగా తనిఖీ చేసి షాంపిళ్లను ల్యాబ్ పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ల్యాబ్ నుండి వచ్చిన రిసల్ట్ ప్రకారం తీసుకున్న చర్యలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎక్సైజ్ శాఖ చేస్తున్న డ్యూటీ దుకాణాలను తనిఖీ చేయడం మాత్రమే శాంపిలను ల్యాబ్ పంపించడం వరకు తర్వాత కల్తీ కళ్ళు పై తీసుకున్న చర్యలు శూన్యం..?
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి,కల్తీ కల్లు నివారణకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ప్రజల శ్రేయస్సు కోరి సంబంధిత అధికారులు, చొరవ చూపి ఇలాంటి కల్తీ కళ్ళు స్థావరాలపై దాడులు జరిపి కల్తీ కనులు అంతం అందించాలని పలువురు విశ్వసిస్తున్నారు.