Wednesday , July 24 2024

ప్రమాదం అని తెలిసిన పట్టించుకోరా ?

  • సమాచరం అందిన చెలనం లేని విద్యుత్ శాఖ

పర్మిషన్ లేకుండా రెండు సంవత్సరాలుగా విద్యుత్ వినియోగం

  • రాజకీయ అండ ఉంటే ఏమైనా చేయొచ్చా ?

తెలంగాణ కెరటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో ఆగస్టు 3

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని జిల్లా ప్రజల ఆరోపిస్తున్నారు. మాకు సమస్యలు ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులకు రైతులు చెప్పిన పట్టించుకోవడంలేదని, చివరికి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే తప్ప విద్యుత్ శాఖ అధికారులో చలనం లేదని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే రామేశ్వరంపల్లి గ్రామం నుండి ఆరేపల్లి కి వెళ్లే రోడ్లో ప్రధాన రహదారికి అడ్డంగా కట్టెలుపాతి దాని పై నుండి సుమారు 500 మీటర్ల వరకు సర్వీస్ వైర్ వేశారు. దీనికి విద్యుత్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేవని లైన్మెన్ పేర్కొన్నాట్లు సమచరం. ఏ చిన్న వర్షానికి గాలి విచిన వాహన దారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఆ రైతు తీసుకున్న కలెక్షన్ కు విద్యుత్ శాఖ నుండి ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో ట్రాన్స్ఫారం నుండి విద్యుత్ పొందుతున్న రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంత జరుగుతున్న రైతు వల్ల ఇబ్బందులు కలుగుతున్న విద్యుత్ శాఖ అధికారులో చలనం లేదు. ఈ విషయంపై లైన్మెన్ నుండి మొదలుకొని ఎస్ ఇ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు సామాన్య రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ శాఖకు మాత్రం ఎవరు ఒక నెల, రెండు నెలల బిల్లులు చెల్లించకుంటే ఎలాంటి సమాచారం లేకుండానే కలెక్షన్లు తీసివేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.