Thursday , May 23 2024

ప్రజా ఆశీర్వాద ర్యాలీని విజయవంతం చేయండి

—- బి.ఆర్.ఎస్. పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం చిన్నరెడ్డి

తెలంగాణ కెరటం ఆర్మూర్ ఆగస్టు 24:
ఆర్మూర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ప్రకటించబడిన శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి 25 తేదీన నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో నియోజకవర్గస్థాయి బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు,ప్రజలు 2000 కార్లు,1000 బైకులతో ఘన స్వాగతం పలకనున్నారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ బి.ఆర్.ఎస్. పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం చిన్నరెడ్డి మాట్లాడుతూ ఇట్టి ఈ కార్యక్రమం తేదీ 25 శుక్రవారం, ఉదయం 9 గంటలకు ఆర్మూర్ పెర్కిట్ హైవే బ్రిడ్జి నుండి అంకాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వరకు ఇట్టి ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఇట్టి ఈ కార్యక్రమం ర్యాలీకి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.