Saturday , October 12 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని

నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష .

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

ప్రెసైడింగ్, అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులను
ఆదేశించారు.


శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను,ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ నెల 8 వరకు నిర్వహించు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సెంటర్ లోపలికి సెల్ ఫోన్ల ను అనుమతించరాదని అక్కడి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. . ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు