Saturday , October 12 2024

ఆ పొగ తట్టుకోలేకున్నాం అధికారులూ…ఎలా అనుమతించారు

జనవాసాల నడుమ తినుబండారాల కర్మాగారం

వాసన, పొగతో బెంబేలెత్తిపోతున్న స్నేహ నగర్ వాసులు

తెలంగాణ కెరటం సూర్యాపేటజిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 : కేంద్రంలో జనవాసాల నడుమ ఏర్పాటు చేసిన తినుబండారాల కర్మాగారం స్నేహ నగర్ వాసులకు ప్రాణ సంకటంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్ లో పట్టణంలోని ఓ బేకరీకి చెందిన తిను బండారాల కర్మాగారం ఏర్పాటు చేయడంతో నిత్యం పొయ్యిలో వంటలు చేస్తుండడంతో వాసన, పొగతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు కూడా లేవని భయం భయంగా బతకాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల నడుమ ఇలాంటి తినుబండారాల కార్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు బేకరీ ఆహార పదార్థాల తయారీపై, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులపై, వారికున్న అనుమతులపై విచారణ చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం పొగ రావడంతో చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిత్యం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని జనావాసాల నుంచి అట్టి కర్మగారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.