తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధి మే 20:
జహీరాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ గెలుపు ఖాయమని పిట్లం మండల కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఏను గండ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారంనాడు ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుండి సురేష్ శెట్కర్ గెలుపు ఖాయమని సుమారుగా పదివేల నుండి 20వేల మెజార్టీతో సురేష్ షెట్కర్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలలో ఎనలేని అభివృద్ధి కొనసాగుతుందని, డిగ్రీ కళాశాలల లేని ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలు నెలకొల్పడం జరుగుతుందని, పిట్టo మండలంలో ఇప్పటికే జాతీయ రహదారి వలన గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, బోధన్ నుండి బీదర్ వరకు వయా పిట్లం మీదుగా రైలు మార్గాన్ని నిర్మిస్తారని, ఆశాభావం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేస్తాడని, పారిశ్రామిక హబ్ గా మార్చి పరిశ్రమలను నెలకొల్పి, నిరుద్యోగ సమస్యను తీరుస్తారని,, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగిందని, తద్వారా సురేష్ శెట్కర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన అన్నారు.