Tuesday , July 16 2024

నిజం సాగర్ ప్రాజెక్టును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధికామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ ప్రాజెక్టును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతా అని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఆదివారం నాడు అమెరికా నుండి వచ్చిన మిత్రులతో ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు జరుగుతున్న గత పాలకులు నిజం సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపలేదని అని ఆయన అన్నారు. కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టు పట్ల గత పాలకులు పట్టించుకోలేదని ప్రాజెక్టు అభివృద్ధి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి ప్రాజెక్టు కోసం నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.