Sunday , May 26 2024

ముఖ్యమంత్రిని కలిసిన జూకల్ యూత్ నాయకులు సౌదగర్ అరవింద్తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధిజుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ నాయకులు సౌధగర్ అరవింద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం నాడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల గెలుపుకు కృషిచేయాలని తదితర సూచనలు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తం తిరిగి ఎంపీ అభ్యర్థి సురేష్ సెట్కర్ గెలుపుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.