Monday , September 16 2024

పోలీస్ స్టేషన్ సందర్శించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధికామారెడ్డి జిల్లా పెద్ద కొడు పగల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను బుధవారం నాడు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోనారెడ్డి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివరాలను విద్యార్థులకు వివరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బాతులను చూసి విద్యార్థులు ఆనందంతో వాటిని తిలకించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పైకి రావాలని తాము చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.