Tuesday , July 16 2024

బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 5.45 లక్షల రూపాయలు పట్టివేత తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధికామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద బుధవారం నాడు బొలోరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 5. 45 లక్షల రూపాయలను పట్టుకున్నట్లు నిజం సాగర్ ఎస్సై సుధాకర్ తెలిపారు. పట్టుకున్న రూపాయలకు ఎలాంటి కాగితాలు లేకపోవడంతో రూపాయలను సిజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.