తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
బాలల హక్కులలో భాగంగా మహిలాభివృద్ది శిశుసంకేమశాఖ వారు మక్తల్ మండల గ్రామ దండు చిమర్లోని ఇటుక బట్టిల దగర పని చేస్తున్న వివిధ రాష్ట్రాల కుల్లీల కు మరియు యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిల్లలకు హెల్ప్ లైన్ నారాయణపేట కోఆర్డినేటర్ నర్సింహులు మాట్లాడుతూ బాలల హక్కులను అందరూ గౌరవించాలని పిల్లల హక్కులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని బడి ఈడు పిల్లలు బడిలో వుండాలని దేశ అభవృద్ధికి పిల్లలు ప్రాముఖ్యం ఎనలేనిది అన్నారు,మాట్లాడుతూ బాలల హక్కులు మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ వారు కల్పించు సదుపాయాల గురించి వివరించారు. ఐసిపిస్ కౌన్సిలర్ విజయ్ మాట్లాడుతూబాలకార్మిక నిషేధ చట్టం 1986 గురించి వివరించి పిల్లలకు పనిజరుగు ప్రాంతం లో చదువుకునేందుకు వసతి కల్పిచలని పని జరుగుతున్న ప్లేస్ కి పిల్లలను తీసుకువెళ్ళవదని సూచించారు. సూపరవైజర్ బాలరాజు మాట్లాడుతూ 1098 ను ఉపయోగించుకునే విధానం మరియు విద్యాహక్కు చట్టం బాల వివాహనిషేదచట్టం 2006 గురించి వివరించారు. మాట్లాడుతూ బాలల హక్కులు మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ వారు కల్పించు సదుపాయాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఇటుక బట్టీల వోనర్స్,ఇటుక తయారీ మరియు ట్రాన్స్పోర్ట్ పని వాలు పాల్గొన్నారు.