Monday , July 22 2024

ఫ్రొటో కాల్ పాటించలేదని అలిగిన ఎంపీపీ.ప్రాదేయపడిన. ఐసిడిఎస్ పిడి.

తెలంగాణ కెరటం మక్తల్:

జిల్లా కలెక్టర్. జిల్లా జడ్పిచేర్పర్సన్అధ్యక్షతన మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మక్తల్ ఎంపీపీ వనజమ్మ అలిగి జిల్లా అధికారి నిలదీసింది. మహిళా అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అవగాహన సదస్సు కార్యక్రమంలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రోటోకాల్ ప్రకారము తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర అధికారులను వేదికపైకి పిలవడం నన్ను కించపరిచినట్టునే గదా అని మహిళ సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ నిలదీయడం జరిగింది.
ఈ విషయాన్ని

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
గమనించడం చివరకు సమావేశంకు హాజరైన ఎంపీటీ ఎంపీపీ జడ్పిటిసిలు సర్పంచులు గమనిస్తుండగా క్షమాపణ కోరడం జరిగింది.