Tuesday , July 16 2024

పర్మిషన్ తెలంగాణలో వేసేది కర్ణాటకలో‼️❓

ఇసుకను బార్డర్ దాటిస్తున్నారు…‼️

కాంట్రాక్టర్, అధికారుల కుమ్మక్కు!‼️

మీడియాపై దురుసుగాగా మాట్లాడిన మైనింగ్ ఆర్ ఐ,

బాస్ చెప్పారు నేను పంపించాను అంటున్నావా‼️❓
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

ఆన్లైన్ ఇసుక అక్రమార్కులకు పూల వర్షం కురిపిస్తుంది అనడానికి నిదర్శనం గత 15 రోజుల నుంచి మాగనూర్, తెలంగాణ బార్డర్ గ్రామాలకు ఆన్లైన్లో ఇసుక ను బుక్ చేసుకుని, కర్ణాటకలోకి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మాగనూర్ మండలం వర్కుర్ గ్రామంలో ప్రభుత్వం ఇసుక రీచ్ లను నడుపుతుంది. గృహ నిర్మాణ అవసరాలకు నారాయణపేట జిల్లా పరిధిలో ఆన్లైన్ ద్వారా ఇసుక తరలింపుకు అనుమతి ఇచ్చింది. అయితే కృష్ణ మండలం చేగుంట గ్రామం పేర్లతో కాంట్రాక్టర్లే ఇసుకను బుక్ చేసుకుని ఆ ఇసుకను మాత్రం కర్ణాటకకు యదేచ్చగా తరలిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో ఉన్న టిప్పర్ ఇసుక ధర కంటే కర్ణాటక ఇండస్ట్రిలకు అధిక ధరకు అమ్ముతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మైనింగ్ ఆర్ ఐ రమేష్ ను వివరణ కోరగా జిల్లాలో బుకింగ్స్ లేనందున బార్డర్ పేరుతో బుక్ చేసుకుని కర్ణాటకకు ఇసుక తరలుతున్న విషయం వాస్తవమేనని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఇసుక కర్నాటకకు తరలిస్తున్నట్లు తెలిపారు. తరులుతున్న ఇసుక తమరికి తెలియదా అంటూ మీడియా ప్రతినిధులపై కూడా దురుసుగా మాట్లాడారు,ఏది ఏమైనా ఆన్లైన్ ఇసుక అక్రమార్కులకు కనక వర్షం కురిపిస్తుంది అనడానికి అతిశయోక్తి లేదు అని ప్రజలు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా టిప్పర్ యజమానులు ఫేక్ వ్యక్తులపై ఆన్లైన్ ఇసుక బుక్ చేసుకొని, ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ లేని వాళ్లకు ఇసుకను అధిక ధరలకు అమ్ముతున్నారు. మరి అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేస్తారా అక్రమార్కులకు వత్తాసు పలుకుతారా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది,