Sunday , May 26 2024

పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి అప్పగించే విధంగా చర్యలు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు కలెక్టర్లను ఆదేశించారు.


నారాయణపేట జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి.

పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియ పూర్తి  చేసి అప్పగించే విధంగా చర్యలు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు కలెక్టర్లను ఆదేశించారు. 

శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని జాతీయ రహదారుల పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియ పై కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి మార్చి 31 వరకు అవార్డు పాస్ చేసి స్థలాన్ని జాతీయ రహదారులకు అప్పగించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష మాట్లాడుతూ నారాయణపేట లో జాతీయ రహదారీ 167 కు సంబంధించి పెద్ద చింతకుంట నుండి గుడెబల్లూర్ వరకు 9 గ్రామ పంచాయతీల లో 231.16 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉందని ఇప్పటికే 59.6 హెక్టార్లలో 3జి పాస్ చేసి పబ్లిష్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన 171.81 హెక్టార్లకు మార్చి 15 వరకు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేసారు. మొత్తం 231.16 హెక్టార్లు జాతీయ రహదారికి అప్పగించడం జరుగుతుందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, డి.టి. బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

3 comments

  1. Excellent web site. A lot of useful info here. I’m sending
    it to some buddies ans additionally sharing in delicious.
    And obviously, thanks for your effort!

  2. You could certainly see your enthusiasm within the work you write.
    The arena hopes for more passionate writers
    such as you who aren’t afraid to say how they believe. Always go after your heart.

  3. This is a very good tip particularly to those fresh to the blogosphere.
    Short but very accurate information… Appreciate your sharing this one.

    A must read post!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *