Sunday , May 26 2024

టాస్క్ ఫోర్స్ మరియు CCS టీం పోలీసుల దాడి 7 మంది జూదరులపై కేసు నమోదు

తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధి ఫిబ్రవరి 15.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని సమాచారం మీదకు కామారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్, CCS టీం మరియు పిట్లం పోలీస్ వారు తేదీ 15..02.2024 నాడు పిట్లంలోని ధాబా లో 7 మంది పేకాట ఆడుతుండగా ఆ పేకాట స్థావరం పైన దాడి చేసి వారిని పట్టుకొని, వారి నుండి మొత్తం నగదు డబ్బులు 17230/- మరియు 07మోటర్ సైకిల్లు, సెల్ ఫోన్లు సీజ్ చేసి వారి పైన కేసు నమోదు చేయనినది.

     ఇకముందు కూడా  ఎవరైనా పేకాట అడిన వారిపై చట్టపరమైన చర్యలు  తీసుకుంటామని తెలియజేశారు.

 ఈ ఆపరేషన్ లో పాల్గొన్న  కామారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు  CCS టీం వారిని జిల్లా  ఎస్పీ సింధుశర్మ గారు అభినందనలు  తెలియజేశారు 
 అదేవిధంగా జిల్లాలో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాలు పడితే వారి యొక్క సమాచారాన్ని 100 డయల్ గాని సంబంధిత అధికారులకు  తెలియజేయాలి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు.