Wednesday , July 24 2024

కలెక్టర్ సాబ్ జర దేకో

మక్తల్ మున్సిపాలిటీ ఆదాయానికి గండి.

రాజకీయ నాయకులతో కుమ్మక్కై పట్టించుకోని మున్సిపల్ కమిషనర్.

అయ్యా జిల్లా పెద్ద సారు జర ఇటువైపు చూడండి.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ లో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అందిన కాడికి దోచుకోవడమే వాళ్ళ పని అన్నట్లు మక్తల్ మున్సిపాలిటీ కమిషనర్ తీరు కనబడతా ఉంది. మక్తల్ మున్సిపాలిటీలో 2023 .2024 కు గాను తయిమ్ బజార్ వేలంపాటను నిర్వహించారు. ఈ వేళ పాటకు గాను సాయిరాం అను వ్యక్తి 11 లక్షల 50 వేలకు వేలం పాటలో దక్కించుకున్నారు. వేలం పాటలో పాల్గొన్నదలచినప్పుడు రెండున్నర లక్షల డిడిని మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలి. అనంతరం వేలం పాటలో పాల్గొనాలి. వేలం పాటలో పాల్గొనే సమయంలో డిడిని వారు చెల్లించారు. వేలంపాటలో దక్కించుకున్న మొత్తాన్ని మూడు విడుదలవారీగా మున్సిపాలిటీ కి చెల్లించాలి. అనగా మూడు మూడు లక్షల రూపాయలు చొప్పున మూడు నెలలకు ఒకసారి చెల్లించాలి. అనే మున్సిపాలిటీ చట్టం ప్రకారం కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి పన్ను ఇంటి పన్ను పేరుతో నెల నెల ముక్కు పిండి వసూలు చేస్తూ వారి సిబ్బంది వసూలు చేస్తారు. అయితే స్థానిక కమిషనర్ కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్బలంతో వారు చెప్పింన విధంగా కమీషనర్ అమలు చేశారు. అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ గుచ్చేదారు చెల్లించిన డిడి నీ సైతం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సమయం అయిపోయింది అని సదరు గుత్తేదారుకు డీడిని తిరిగి రిటన్ ఇచ్చేశారు. అనంతరం సదరు గుత్తేదారు సమాచారం మేరకు 4: 80 వేల రూపాయలు మున్సిపాలిటీ ఇప్పటివరకు చెల్లించినట్లు ఓ అధికారి తెలిపారు. మార్చి 2023 నుంచి మార్చి 2024 వరకు వారి సంవత్సరం కాలం కి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఇప్పటివరకు వారి నుంచి మిగతా అనగా 6 లక్షల 20వేల రూపాయలను మున్సిపల్ కమిషనర్ వసూలు చేయకుండా స్థానిక కొంతమంది నాయకులతో కుమ్మక్కై ఆ డబ్బులను వసూలు చేయడం లేదని కొందరు అంటున్నారు ఇకనైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆ గుత్తేదారు నుంచి డబ్బులు వసూలు చేయిస్తారా లేదా అని అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం కొరకు కిందియా స్థాయి కమిషనర్ పై ఒత్తిడి తీసుకురావాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందిస్తారా లేదా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.