Sunday , May 26 2024

పెద్ద కొడప్పుగల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం

తెలంగాణ కెరటం జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి: నవంబర్ 20:

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్పగల్ మండలంలో ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం జగనాథ్ పల్లి చిన్న తక్కడుపల్లి లింగంపల్లి విట్టల్ వాడి బాబుల్ గావ్ విట్టల్ వాడి తాండ పోచారం తండా పోచారం గ్రామాలలో జోరుగా ప్రచారం

చేయడం జరిగింది. ఎమ్మెల్యే హనుమంత్ షిండే కు గ్రామ ప్రజలు డబ్బుల చప్పుడుతో మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ మళ్లీ మీరే రావాలి మళ్లీ మీరే ఎమ్మెల్యే కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మరియు ఉమ్మడి మండల డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్ మరియు మహారాష్ట్ర బిఆర్ఎస్ నేత మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు చైర్మన్లు డైరెక్టర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.