Saturday , October 12 2024

గజ్వేల్లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత,?

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో:

గజ్వేల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగుపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం వాహనాన్ని పట్టుకున్నారు. అజ్ఞాత వర్గాల అందించిన సమాచార ప్రకారం కొమరవెల్లి మండల కేంద్రం నుండి ap 36 B 6802 అనే డీసీఎం వాహనంలో సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న మీడియా ప్రతినిధులు అట్టి వాహనాన్ని ఆపి డ్రైవర్ ను ఈ వాహనంలో ఏముందని ప్రశ్నించారు. ఈ డీసీఎం వాహనంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా చేగుంటకు తరలిస్తున్నామని తెలిపాడు. తాను ఒక డ్రైవర్ ను మాత్రమేనని పూర్తి వివరాలన్నీ కొమరవెల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించినవని తెలిపాడు. వెంటనే ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో 4 లక్షల విలువ ఉంటుందని అంచనా. కొమర వెళ్లి మండల కేంద్రంలో ఆ వ్యక్తి చాలా కాలం నుండి ఈ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. సదరు వ్యక్తి రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని మీడియా ప్రతినిధులు పట్టుకున్నారని విషయాన్ని తెలుసుకొని సెటిల్మెంట్ చేయమని ఒక ప్రతినిధిని పంపాడు. ఆ ప్రతినిధి తాను ఒక మీడియా ఛానల్ లో విలేఖరిగా పనిచేస్తున్నానని ఏమైనా డబ్బులు ఇస్తారు .వాహనాన్ని విడిచిపెట్టమని కోరాడు. మీకు ఎన్ని డబ్బులు కావాలో ఇప్పిస్తానని ప్రలోభ పెడుతూ మీరు పోలీసుల నుండి మీ పిటిషన్ విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి తెచ్చాడు.ఈ విషయమై పోలీసుల వివరణ కోరగా రేషన్ బియ్యానికి సంబంధించిన సమాచారం సివిల్ సప్లై అధికారులు వచ్చి పంచనామా చేస్తారని ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు.