Saturday , October 5 2024

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టలేరా?పౌర సరఫరాల అధికారులు ఎందుకు జంకుతున్నారు

  • ముడుపులు అందుతున్నాయా లేక ప్రజాప్రతినిధులకు భయపడుతున్నారా
  • నామమాత్రపు కేసులతో సరిపెడుతున్న అధికారులు
  • జిల్లా కేంద్రంలో ఇద్దరిపై పీడి యాక్ట్ నమోదు చేయబోతున్న ము – డీఎస్ఓ
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సమన్వయంతో పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతటా పంపిణీ జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో పిడిఎస్ బియ్యం పంపిణీ జరుగుతున్న మరుసటి రోజు నుండి పిడిఎస్ బియ్యాన్ని కనుగొన్న చేసే అక్రమ వ్యాపారులు వాటి కొనుగోలు చేస్తున్నారు. . వాటిని రైస్ మిల్లులతోపాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొందరు వడ్లు, మక్కలు, చింతగింజలు తదితర వాటిని కొనే వారి దగ్గరికి తీసుకువెళ్లే సమయంలో కొందరు ఆ బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యాన్ని రోడ్లపై పోసి వారి వాహనాలను వాటిపై తింపి వాటిని బ్రౌన్ రైస్ ( నూకలు) గా మార్చి విక్రయిస్తుండగా మరికొందరు. ఆ బియ్యాన్ని అలాగే తీసుకువచ్చి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతిరోజు టన్నుల కొద్ది పిడిఎస్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు మాత్రం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో పిడిఎస్ బియాన్ని సిరిసిల్ల రోడ్లో గల ఒకరు మాత్రమే కొనుగోలు చేస్తూ, ఇతరులు కొనుగోలు చేస్తే వారిని అతని అనుచరుల ద్వారా అధికారులకు పట్టిస్తూ వారు వ్యాపారం చేసుకోకుండా చేస్తున్నట్లు సమాచారం. అధికారుల సైతం ఇతను వద్దకు రావాలంటే జంకుతున్నట్లు వెనుక ముందు ఆలోచన చేస్తున్నారని అదే వేరేచోట పిడిఎస్ బియ్యం ఉన్నాయని తెలిస్తే పది నిమిషాల్లో వాలిపోయే అధికారులు ఇతని వద్ద ఉన్నాయని సమాచారము చేరవేసిన, ఇగ వస్తున్నాం అంటూ ఆ తర్వాత ఫోన్ కూడా తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమాన్ ముందు రామారెడ్డి వెళ్లే మార్గంలో ఒక కొనుగోలు కేంద్రం అందులో మక్కలు, జొన్నలు, తైదలు, గోధుమలు, కొబ్బెర, చింతగింజలు తదితర వాటితో పాటు పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ అధికారులకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. దొరికిన చిన్న చిన్న కేసులు నమోదు చేయించుకొని తిరిగి అక్రమ వ్యాపారం యదేచ్చగా చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పేద ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న అధికారులు మాత్రం నామమాత్రము కేసులు చేస్తూ దానికి మేము ఏమి చేయలేమని చెప్పడం విడ్డూరంగా ఉంది.
    పట్టణంలో
  • ఇద్దరిపై పిడియాక్ట్ నమోదు చేస్తాం. కామారెడ్డి డిఎస్ఓ
    జిల్లాలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసిన సరఫరా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని కామారెడ్డి జిల్లా డిఎస్ఓ . పిడిఎస్ బియ్యం కొనుగోలుదారులపై పోలీసుల ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశామని, కొనుగోలు దారులను పట్టుకొని త్వరలోనే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు