Monday , September 16 2024

పట్టపగలు.. అందరూ చూస్తుండగానే మహిళ మెడలో బంగారు ఆభరణాల చోరీ

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి

రామాయంపేట మెదక్ అందరూ చూస్తుండగానే పట్టపగలు దొంగలు బరి తెగించారు. ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన శుక్రవారం రామాయంపేటలో వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సుతారిపల్లి గ్రామానికి చెందిన రాగి రాజమణి, తన భర్త బాలయ్యతో కలిసి బ్యాంక్‌కు వచ్చింది. బాలయ్య బ్యాంకు లోపలకు వెళ్లగా, రాజమణి బయట నిలబడింది. నంబరుప్లేట్‌ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె పక్కనే ఆగారు. బైక్‌ వెనుక కూర్చున్న వ్యక్తి ముందు, వెనుకా పరిసరాలను పరిశీలించి, ఒక్కసారిగా రాజమణి మెడలో బంగారు పుస్తెలతాడు లాగాడు. దీంతో ఊహించని సంఘటనతో రాజమణి కిందపడిపోగా, క్షణాల్లోనే వారు సిద్దిపేట రోడ్డువైపు పారిపోయారు. కిందపడ్డ రాజమణి ముక్కుకు గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ రంజిత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ మెడలో బంగారు ఆభరణాల చోరీ

గాయపడిన బాధితురాలు
పట్టపగలు.. అందరూ చూస్తుండగానే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *