Wednesday , July 24 2024

పాత్రికేయుల ఆధ్వర్యంలో చేయూత

తెలంగాణ కెరటం
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట ప్రతినిధి
మార్చ్ : 5

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి దేవయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ పోషణ భారంగా మారడంతో మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న పాత్రికేయులు మారెపు భూశంకర్ , పంజ సంపత్ కుమార్ ఇరువురు విదేశాల్లో ఉన్న మహమ్మద్ లాలాబాయికి సమాచారం అందించగా వెంటనే స్పందించి దాసరి దేవయ్య కుటుంబానికి ఒక నెల పాటు ఆహార ధాన్యాలు అందించారు. 25 కేజీల బియ్యంతో పాటుగా, నిత్యవసర సరుకులు మారేపు భూశంకర్ , పంజ సంపత్ కుమార్ ల ఆధ్వర్యంలో ఇవ్వాల్సిందిగా విదేశం నుండి తెలియజేశారు. సహాయ సహకారాలు అందజేసిన లాలాభాయ్ కి దాసరి దేవయ్య కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కష్టాన్ని తెలుసుకొని స్పందించిన భూశంకర్, సంపత్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు..మిత్రులు ఎవరైనా ఆపదలో ఉంటే తెలియజేస్తే మా వంతుగా ఏదో విధంగా సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తామని వీరు తెలిపారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *