Friday , November 15 2024

పాత్రికేయులపై దాడి చేస్తే సహించేది లేదు.

డీజేఎఫ్ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు:: ఎస్.కె అహ్మద్.

మంచిర్యాల, ఫిబ్రవరి26 (తెలంగాణ కెరటం)

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లో గల జిల్లా ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల పై దాడిని ఖండిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇటీవలే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుద్దాల గ్రామంలో వార్త సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టుల పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు ఎస్ కే.. అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల పైన దాడులు అధికమౌతున్నాయి అని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమష్యల పరిష్కరానికి అనునిత్యం కృషి చేస్తున్నా జర్నలిస్టుల పైన దాడులను సహించేది లేదు అన్నారు. ఈలాంటి దాడులు జరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు లను డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు షేక్, మజర్ అహ్మద్, నరేష్, షోహెబ్, తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *