Sunday , May 26 2024

ఆర్టీసీ కార్మికుల పై యాజమాన్యం వేధింపులు..??2013 పిఆర్సి అమలు ఎప్పుడు..??

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించేనా..??

ఆర్టీసీలో గ్రాట్యుటీ గల్లంతుపై కార్మికుల ఆందోళన

(ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు, నాలుగు ‘డేఅవుట్’ డ్యూటీలు ఒకటి ‘స్పెషల్ ఆఫ్’ లు ఇలా డ్యూటీలు చేస్తే తమ ఆరోగ్యం సహకరించలేక సరైన సమయంలో డ్యూటీ చేయలేకపోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకునేటప్పుడు కార్మికుల నిర్ణయాలు కూడా తీసుకుంటే బాగుంటుండేదని కార్మికుల వాదన దూర ప్రాంతం నుండి డ్యూటీలకు వస్తున్న కండక్టర్లకు ఓటీ కూడా ఇవ్వడం లేదని ఇలా అయితే డ్యూటీలు ఎలా చేసేదని కార్మికులు వాపోతున్నారు.)

వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ

లేలేత మబ్బులలో కంటి ఊసులు తుడుచుకుంటూ..సమయపాలన పాటిస్తూ పని గంటలు లెక్కించుకోని పరిస్థితులలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందా ..!! కార్మికుల పనిగంటలకు సరిపడా ఆర్టీసీ యాజమాన్యం వేతనం ఇస్తుందా..!? అసలు ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏంటి..? కార్మికులు డ్యూటీలో ఎక్కువమంది 141 చార్ట్ ప్రకారం సర్వీసులు నడపాలేక లైన్ ప్రకారంగా ఓటి డ్యూటీ 16 గంటలు చేయాల్సి వస్తుందని. ఇందులో లాస్ట్ ట్రిప్స్ డెడ్ ఇపికే రాకపోవడంతో డీజిల్ కూడా నష్టపోతుందని డ్యూటీలో ఉన్న డైవర్స్ వాదన ఇలాంటి పరిస్థితులలో ఆర్టీసీ నష్టాల వైపు వెళ్తే ఆశ్చర్యపోగాల్సిన అవసరం లేదు. గతంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను నిర్వీర్యం చేసి కార్మికులకను భయాందోళన గురి చేసి, కార్మిక సంఘాలను, రద్దుచేసి శ్రమ దోపిడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేశారా..!! సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దశలవారీగా ఆర్టీసీ కార్మికులకు పిఆర్సిలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట మార్చిందా..? సంస్కరణల పేరట ఆర్టీసీ కార్మికులను వేధింపులకు గురిచేస్తూ పని భారం పెంచుతూ, పదవి విరమణ పొందిన స్థానాలలో ఉద్యోగులను నియమించకుండా, పది నెలల్లో 11 వేల ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందుతే కనీసం ఒక్క ఉద్యోగాన్ని కూడా నియమించకుండా, కారుణ్య నియామకాలు కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షణ చేసిన నియమించలేకపోయారు,వారి హక్కుల కోసం కొట్లాడితే ఆర్టీసీ సంఘాలను కార్మికులను ప్రభుత్వం అణచివేసే కుట్ర చేస్తూ, ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకుండా, ప్రయాణికులపై భారం పెంచుతూ, బస్ చార్జీల సవరణతో ఏటా సంస్థ ఆదాయం పెరుగుతున్నా సంస్కరణల పేరట ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను వేధింపులకు గురిచేస్తూ, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా లాభాలు అర్జిస్తున్నా, కార్మికులకు అలవెన్స్ పెంచకుండా, పని గంటలు
పెంచుతూ, సెలవులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 ఆర్టిసి బస్సులు కొనుగోలు చేసి తుప్పు పట్టిన బస్సులను తొలగిస్తామని చెప్పి కనీసం ఇంతవరకు కూడా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రైవేట్ బస్సులకు ప్రార్ధ్యానత ఇస్తూ, ఆర్టీసీ నష్టాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ ప్రవేట్ దిశగా అడుగులు వేస్తోంది అని చెప్పవచ్చు, సొంత బస్సులు కొనలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉందని చెప్పవచ్చు . రాష్ట్రంలో 5950 బస్సులలో 2700 కాలం చెల్లిన బస్సులను పక్కకు పెట్టలేని పరిస్థితిలో సుమారు 600 బస్సులను పక్కకు పెట్టాల్సినా నిత్యం మరమ్మత్తులు చేయిస్తూ ఈ పాత బస్సులతో మెకానికల్ సిబ్బందిపై తీవ్రమైన పనిభారం పడుతుందని చెప్పొచ్చు. అనేక రూట్లో ఆర్టీసీ లాభాలు పొందుతున్నా కార్మికులకు కనీస వేతనం పెంచకుండా, వారిని శ్రమ దోపిడి చేస్తూ , దోసుకుంటూ ఆర్టీసీ కార్మికులకు కనీస సెలవులు కూడా ఇవ్వకుండా, కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తూ కార్మికులకు పనిభారాన్ని మోపుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
కాలం చెల్లిన బస్సులతో కార్మికులు
కాలం చెల్లిన బస్సులతో గ్రామీణ ప్రాంతాలకు తింపుతూ, బస్సు చక్రాలు ఎప్పుడు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయంతో డ్రైవర్ ఉండడం, మరికొన్ని బస్సులను ప్రజా రవాణాకు వినియోగించే పరిస్థితులలో 386 బస్సులను కార్గో సేవలకు మళ్లించారు. 2019 కి ముందు ఇచ్చిన ఆర్డర్ మేరకు కొత్తగా 2018లో 244 బస్సులు, 2019లో 296 బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరాయి. మిగిలిన డిపోలకు సొంత బస్సులు లేక ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతూ కాలమెల్లదిస్తున్న ఆర్టీసీ నష్టాల్లో ఉండదని ఎలా చెప్పగలం..!! సుమారు ప్రైవేట్ బస్సులు ఇందులో 2700 బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఇందులో ఎక్స్ప్రెస్ 780. పల్లె వెలుగు 1620, సిటీ ఆర్డినరీ 235. మెట్రో బస్సులు 65. గ్రామీణ ప్రాంతాలలో జనాభా అవసరాలకు నిమిత్తం మరో 400 బస్సులకు ఆర్టిసి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చినా ప్రైవేట్ బస్సుల వైపే మొగ్గుచూపుతూ కార్మికులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ, ప్రైవేట్ పరం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పని భారం పెంచుతూ బలవంతంగా ఉద్యోగాన్ని వదులుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఏంటి..?
ఆర్టిసి కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది కానీ, తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంఘాలు లేకుండా చేయడమే ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం కానీ స్పందించిన సందర్భం లేదు. కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఎంతో అని తేలిపోయింది. 2016 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు 2018తో పదవి కాలం ముగిసింది. కానీ ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు సంవత్సర కోసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో కార్మికులు ఐక్యత హక్కుల కోసం పోరాటం మొదలయింది. ఇలాంటి సమ్మె ధర్నాల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని, ప్రయాణికులకు ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని ప్రభుత్వం వాదిస్తుందని తెలుస్తుంది, ఇలాంటి వాదనలతో కాలక్షేపం చేసి కార్మికులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసే కుట్ర జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అప్రమతమై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్టీసీలో గ్రాట్యుటీ గల్లంతు పై కార్మికులు ఆందోళన
ఆర్టీసీ సంస్థలో ఒక్కొక్క ఉద్యోగి బేసిక్ ఆధారంగా కార్మికులు ప్రభుత్వం ఇచ్చే గ్రాట్యుటీ గల్లంతు పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు పింఛన్ విధానం లేకపోవడంతో గ్రాట్యుటీ పై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. కండక్టర్ ,డ్రైవర్, మెకానిక్ రిటర్మెంట్ అవుతున్న ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయ స్థితిగా మారింది. ఆర్టీసీలో పనిచేసే కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్టీసీ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించేవారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ సదుపాయం అందలేక పోతుంది. కొన్ని డిపోలలో ఆర్ ఈ ఎం ఎస్ సభ్యత్వం లభించడం లేదు. ప్రభుత్వం కార్మికుల పట్ల ప్రత్యమాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాల పట్ల కార్మికులు బలి పశువులు అవుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీసీని నష్టాలనుండి లాభాలలో నడుపుతున్న కార్మికుల పట్ల ఆర్టీసీ యజమాన్యం పలు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.