Saturday , October 12 2024

ఫార్మాసిటీ భూసేకరణ అవినీతిమయం

టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం జూలై 9

కుర్మిద్ధ నుంచి చింతపట్ల వరకు చెరువుల పరిశీలన
రైతుల భూమి టిఎస్ఐఐ సి పేరు మీద చేసుకోవడం దుర్మార్గం
2013 భూ చట్టం విరుద్ధంగా భూ సేకరణ
పిచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని లాక్కుంది
భూసేకరణ చట్టం గౌరవించడంలో అధికారులు పూర్తిగా విఫలం
భూ సేకరణలో అన్ని అక్రమాలే
వచ్చే కంపెనీలతో ఈ ప్రాంతం సర్వనాశనం
రాబోయే రోజుల్లో విపరీతమైన కాలుష్యం
బతకలేని పరిస్థితిలో ప్రజలు
వెంటనే ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకోవాలి
ఫార్మాసిటీ రద్దు చేసే వరకు పోరాటం ఆగదు
దీంతో పర్యావరణానికి పెను ప్రమాదం
నవ తెలంగాణ/యాచారం:
ఫార్మాసిటీ భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా సేకరించిందని టీజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని కుర్మిద్ధ నుంచి ఫార్మాసిటీ హటావో తెలంగాణ బచ్చావో అనే అంశంపై తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి, తక్కల్లపల్లి, చింతపట్ల చెరువులను పరిశీలించి ఫార్మాతో జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రైతుల భూమిని టీఎస్ఐ ఐ సి పేరుమీద మార్చుకోవడం దుర్మార్గమని మంది పడ్డారు. 2013 భూ చట్టం విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం విచ్చలవిడిగా భూసేకరణ చేపట్టిందని మండిపడ్డారు. విచ్చలవిడిగా రైతుల నుంచి భూమిని లాక్ ఉందని విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టం నిబంధనలు గౌరవించకుండా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ఇప్పటివరకు ఫార్మా పరిహారం అందలేదని చెప్పారు. ఫార్మాసిటీలో వచ్చే కంపెనీలతో ఈ ప్రాంతం మొత్తం సర్వనాశనం అవుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో విపరీతమైన కాలుష్య భరితంగా ఈ ప్రాంతం మారుతుందని ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణానికి పెద్ద పెను ప్రమాదం రానందని ఆయన గుర్తు చేశారు. ఫార్మాసిటీతో గొలుసుకట్టు చెరువులు, కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. రైతులకు పర్యావరణానికి భవిష్యత్తు తరాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలు విసర్జించే విషపూరితమైనటువంటి రసాయనాలతో గాలి, నీరు, నేల పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఫార్మసిటిని రద్దు చేసే పోరాటం ఆగదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజవర్గ కాంగ్రెస్ నాయకుడు మ ర్రి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు లిక్కి పాండురంగారెడ్డి, సర్పంచులు దంతుక పెద్దయ్య, బందే రాజశేఖర్ రెడ్డి, దోస రమేష్, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు దార సత్యం, కౌవుల సరస్వతి, కనమొని గణేష్, శ్రీకాంత్ నాయక్, వెంకటేష్, కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, స్థానిక నాయకులు, యుగంధర్ రెడ్డి, గడ్డం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.