బిజెపి పార్టీలో చేరిన పిట్లం బి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడుతెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధికామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మంచి శశిధర్ గుప్తాను బీజేపీ పార్టీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వం లో దేశంలో అభివృద్ధి చెందుతున్న కార్యక్రమాలను చూసి బిజెపి పార్టీలో చేరుతున్నట్లు అయన తెలిపారు. బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. బిజెపి పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ను అధిక మెజార్టీతో గెలుపొందడానికి మండలంలో కృషి చేస్తానని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నేత బెజు గం నరసింహులు, ఆర్య సమాజం అధ్యక్షులు పడిగేల విజయకుమార్, బెజ్జుగం కృష్ణ, పడిగెల శ్రీశైలం, బిజెపి నాయకురాలు మంచి స్వప్న బాల తదితరులు పాల్గొన్నారు.
Telangana Keratam
April 10, 2024
Politics, Telangana
323 Views