Monday , September 16 2024

కనుసైగల్లో 10వ తరగతి పరీక్షలు;

కామారెడ్డి జిల్లా పదవ తరగతి పరీక్షలలో ఏం జరుగుతుంది

రాష్ట్రంలో ఆగమవుతున్న విద్యార్థులు

వరుస లీకేజీలతో గందరగోళం

మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేనా

పదవ తరగతిలో యదేచ్చగా మాస్ కాపీయింగ్

పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బాధ్యత ఎవరిది..??

మాస్ కాపీయింగ్ జరుగుతుందని తెలిసిన జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పట్టించుకోకపోవడనికి కారణాలేంటి ..??

తెలంగాణ కెరటం జిల్లా ప్రతినిధి జిల్లా ఏప్రిల్ 08:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడినట్లే అనిపిస్తుంది వరుస పేపర్ లీక్ లతో మెరిట్ విద్యార్థుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష కేంద్రాలలో ఇప్పటికే రెండు పేపర్లు లీక్ అయినట్లు సమాచారం దీనికి కారణాలు ఇప్పటికి కూడా వెలుగులోకి రాలేదు అయినప్పటికీ విద్యాశాఖ యంత్రాంగం పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తుందా

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణ జరుగుతుంది కొన్ని పరీక్ష కేంద్రాల్లో యదేచ్చగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని సమాచారం, ఒక పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతుందని పాత్రికేయుల లకు ఉన్న సమాచారం మేరకు పరీక్షా కేంద్రం ఇంచార్జిని ప్రశ్నించగా అధికారి జిల్లా విద్యాశాఖ యంత్రాంగాన్ని చరవాణి ద్వారా సంప్రదించగా పరీక్షా కేంద్రంలోకి ఎవరిని అనుమతించవద్దు అని అనడమే కాకుండా ఎవరినైనా అనుమతిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించడం దేనికి సంకేతం జిల్లా విద్యాశాఖ అధికారి పరోక్షంగా మాస్ కాపీయింగ్ కు సహకరిస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం అవుతుంది
జరుగుతున్న మాస్ కాపీయింగ్ పై చర్యలు తీసుకోవాలని నైపుణ్యత గల విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొన్నది ఇట్టి విషయంపై పై అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడవలసిందే