Monday , September 16 2024

ఒక్కొక్క డైలాగ్ గూస్బాంస్ వచ్చేలా వుంటాయంటున్నా దర్శకుడు వై ఆర్ చౌదరి

ఒళ్ళు దద్దరిల్లి పోయే డైలాగ్స్ తో వస్తున్న చిత్రం అంటున్న దర్శకుడు వై ఆర్ చౌదరి

తెలంగాణ కెరటం జూలై 10 హైదరాబాద్

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన దర్శకుడు వై ఆర్అ చౌదరి గారు తాను తీసే సినిమా గురుంచి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చుసిన ప్రేక్షకులకు వారి వారి జీవితం లో జరిగిన సంఘటనలు , అనుభూతులు గుర్తుకు వచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు , పాన్ ఇండియా లెవెల్ లో మూవీ తీస్తున్నారు కదా ఇందులో పాటలు ఎలా వుంటాయని అడగగా కథకు తగిన విధంగా పాటలు కూడా చాలా అద్భుతంగా వ్రాయించామని మాకు కావలిసిన విధంగా ఎలా చెపితే ఆలా కాదు అనకుండా చాలా ఓపికతో పాటలు వ్రాసారు వెంకట్ అడ్డాల గారు అని తెలిపారు. ఇందులో ఐదు పాటలు వుంటాయని ఇందులో ఒక పాట మాత్రం నా అభిమాన నటుడు ఎన్. టి. ఆర్ గారు (అతను అంటే నాకు ప్రాణం) అందుకే నందమూరి తారక రామారావు గారి పాటను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అని తెలిపారు. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు ఆకట్టు కునేలా వుంటాయని సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని అన్ని వయసుల వారికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి హృదయాలను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుందని డైరెక్టర్ వై ఆర్ చౌదరి గారు తెలిపారు. ఈ చిత్రానికి టెక్నిషన్స్ మరియు నటీ నటులు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియా మిత్రులందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు అని డైరెక్టర్ వై ఆర్ చౌదరి గారుతెలిపారు.

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సూపర్ గుడ్ ఫిలిం ఆర్ట్ క్రియేషన్స్
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: మీసాల రామకృష్ణ
ఫైట్ మాస్టర్: ఆర్ కె
కెమెరా మాన్: నందు ప్రసాద్
పాటలు: వెంకట్ అడ్డాల
కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం : వై ఆర్ చౌదరి.