Wednesday , July 24 2024

ఓ మహిళా నీకో వందనం

అత్యవసర పరిస్థితుల్లో రక్తదానంచేసిన మహిళను ఘనంగా సత్కరించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు

తెలంగాణ కెరటం వేములవాడ ప్రతినిధి

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 18 సంవత్సరాల వైష్ణవికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా వత్సల్య ఫౌండేషన్ ద్వారా తెలుసుకుని నేనున్నాను అంటూ ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తూ శ్రీమతి కోమటి మేఘన లవన్ వెంటనే స్పందించి సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి వెళ్లి తోటి మహిళకు రక్తదానం చేయడం అభినందనీయం ఇట్టి రక్తదానం చేసిన కోమటి మేఘనను ట్రస్టు సభ్యులు అభినందిస్తూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలువా సత్కరించి మేమెంటో అందజేశారు. ఇట్టి రక్తదానానికి ప్రోత్సహించిన భర్త లవన్ గారిని ట్రస్ట్ సభ్యులు అభినందించారు

కోమటి మేఘన మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని రక్తదానం చేయడం వల్ల మనకు ఏ ఇబ్బందులు ఉండవు అని, రక్తదానం చేసినవారు దేవుడితో సమానమని, రక్తదానం చేయడం వల్ల మనకు తీవ్ర నష్టం కలుగుతుంది అని అపోహలు మాని అందరూ విధిగా 90 రోజులకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, మనం ఇచ్చిన రక్తం మన శరీరంలోకి 24గంటల లోపు కొత్త రక్తం వస్తుంది అని అన్నారు. నన్ను వేములవాడ పిలిపించి రాజన్న సన్నిధిలో సన్మానించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులకు, సభ్యులకు కృతజ్ఞతలు అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులతో పాటు వాత్సల్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.