Tuesday , July 16 2024

బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి

రాజకీయంగా,ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన నాయకులు ఎన్టీఆర్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఫిబ్రవరి08:

మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ,దుబ్బాక నియోజకవర్గ టిడిపి ఇంచార్జి ఇల్లెందు రమేష్
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ని బస్టాండ్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,పద్మ శ్రీ డాక్టర్ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు,దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు కార్యకర్తలు పార్టీలకతీతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ,దుబ్బాక నియోజకవర్గ టిడిపి ఇంచార్జి ఇల్లెందు రమేష్ మాట్లాడుతూ, మాహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని దుబ్బాక లో ఆవిష్కరించడం చాలా సంతోషమని ఇది నా అదృష్టం గా భావిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు.తెలుగుదేశంపార్టీ ని స్థాపించిన 9 నెలలలో నే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోరం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుంది అని ఈ సందర్భంగా తెలిపారు.బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి రాజకీయంగా,ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన నాయకులు ఎన్టీఆర్ అని తెలిపారు. కూడు, గుడ్డ,గూడు అని నినాదం తో రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యంగా తెలంగాణా లో పటేల్ పట్వారీ వ్యవ్యస్థ ను రూపుమాపి పేదలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి,తెలంగాణ లో బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్ర్యము ఇచ్చిన నాయకులు మహనీయులు స్వర్గీయ ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా వెంటనే కేంద్ర ప్రభుత్వంస్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.