*నీట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చెన్న నిత్యశ్రీ కి సన్మానం
— ఆర్థిక సహాయం అందించిన ఫ్రెండ్లీ చిట్టి గ్రూప్ సభ్యులు*
తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 15:
ఆర్మూర్ పట్టణం లోని
నీట్ పరీక్ష లో పద్మశాలి ముద్దు బిడ్డ చెన్న శ్రీమన్ కూతురు చెన్న నిత్యశ్రీ 646 మార్కులు సాధించిన విద్యా కుసుమంకు ఫ్రెండ్లీ చిట్టి గ్రూప్ సభ్యులు సన్మానించి 15000 /- రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మ్యాక ( త్రివేణి )గంగాధర్ మాట్లాడుతూ… మన నిజామాబాద్ జిల్లా నుండి పద్మశాలి ప్రతినిధి నిత్యశ్రీ కి నీట్ క్వాలిఫై కావడం చాలా గర్వకారణం ఈమె మంచి భవిష్యత్తు, ఉన్నతమైన శిఖరాల అందుకోవాలని, మంచి స్పెషలైజేషన్ డాక్టర్ గా తయారయి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి చెన్న రవికుమార్, ఇట్టెం జీవన్ , చిట్ల విజయ్ రావు,గొనె దామోదర్,చెలిమేల గంగాధర్,నూకల శ్రీనివాస్,నవనాథ్ సత్యనారాయణ, ప్రవీణ్ కోటగిరి, మ్యాక శ్రీకాంత్,శ్రీనివాస్ గౌడ్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నీట్ లో క్వాలిఫై అయిన చెన్న నిత్యశ్రీ వారి తండ్రి చెన్న శ్రీమాన్ గ్రూప్ సబ్యులకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు.