Tuesday , July 16 2024

నిర్మల్ సెగ్మెంట్ లో ఎవరికి అగ్నిపరీక్ష…?

రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు…!

మంత్రికి టికెట్ డౌటేనా..?? మంత్రి అల్లోల మాటలో మర్మమేంటి..?

వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ

(ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీ ప్రజా పరిధిలో సమావేశంలో చీట్టింగ్ స్థానాలపై మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన వార్నింగ్ నిర్మల్ జిల్లా ఎవరికి. డౌట్.. మంత్రి పేరు కూడా ఉన్నదా.. ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయా..? నిర్మల్ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సభలో టిక్కెట్ ఎవరికీ ఇచ్చినా కార్యకర్తల పని చేస్తానన్నా.. మంత్రి వాక్యాలు.. దేనికి సంకేతం..??)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిర్మల్ నియోజకవర్గం రాజకీయంపై చర్చలు జరుగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఎవరు పార్టీలు మారుతారో, ఎప్పుడు ఎటువైపు నుంచి ముప్పు వస్తుందో నాయకులకు కూడా అంతుచిక్కని తలనొప్పిగా మారింది. అదేవిధంగా భయాందోళన మొదలైందని చెప్పవచ్చు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలను, నాయకులను ప్రసన్నం చేసుకుని, చేరదీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. హస్తాన్ని వీడి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కమలం గూటికి చేరిన తర్వాత నిర్మల్ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి అని చెప్పవచ్చు. రెండు పర్యాయాలు టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా బరిలో నిలిచి దిగ్విజయం సాధించి, రెండు పర్యాయాలు మంత్రిగా బాధ్యతలను చేపట్టి నిర్మల్ అభివృద్ధి మంత్రంగా దూసుకుపోతున్న మంత్రి అల్లోల వైపు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సుముఖంగా లేకపోవడం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తలనొప్పిగా మారింది అని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. అధికార పార్టీలో అసమ్మతి సెగలు వరుసగా తాగుతున్నాయి. అధికార పార్టీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించిన నాయకులు కూచాడి శ్రీహరి రావు అసమ్మతి గళం ఎత్తుకొని బహిరంగ విమర్శలను చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గౌరవం లేదని అతని వాదన. దీంతో అతను వచ్చే ఎన్నికలలో మంత్రికి మద్దతు తెలుపుతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ మద్దతు తెలుపకపోతే శ్రీహరి రావుకు ఉన్న ఓటు బ్యాంక్ మంత్రి కోల్పోయే అవకాశం ఉంది. అదేవిధంగా మేజర్ మండలం సారంగాపూర్ కు చెందిన ప్రస్తుత జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అధికార పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. గతంలో ఎమ్మెల్సీ టికెట్ కు ప్రయత్నించినప్పటికీ మంత్రి చేసిన రాజకీయంగానే తనకు ఎమ్మెల్సీ దక్కలేదని, పార్టీ కొరకు కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గౌరవం లేదని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి వాదన. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి బిజెపి గూటికి చేరిన తర్వాత అసమ్మతి అధికార పార్టీ కార్యకర్తలను ,నాయకులను కలుస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంట్లో భాగంగానే నిర్మల్ ఎట్రిక్ కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్ ను స్వయంగా వారి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. ఎట్రిక్ కౌన్సిలర్ ఒకవేళ అధికార పార్టీని కాదని బిజెపిలో చేరితే మంత్రికి నిర్మల్ లో మైనస్ గానే చెప్పవచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రి కుటుంబ పెత్తనం…
నిర్మల్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి కుటుంబ పెత్తనం జరుగుతుందని పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ నియోజకవర్గం లోని మండలాలలో ఆయా మండలాలకు కుటుంబంలోని సభ్యులు పెత్తనం చెలాయిస్తుండడం, నాటి పట్వారి వ్యవస్థ ను తలపిస్తుందని సొంత కార్యకర్తలే విమర్శిస్తున్నారు. మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పనుల కొరకు మంత్రి ఇంటికి వెళ్తే సమస్య వినడం అటునుంచి, కనీస మర్యాద కూడా ఇవ్వరని పార్టీకి చెందిన సొంత కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

మారిన రాజకీయ సమీకరణం…
మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోకముందు అధికార పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందన్న ధీమాతో ఉన్న మంత్రి అల్లోల మహేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరాక కాస్త భయంతో గురవుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడం, సొంత కార్యకర్తల నుండి అసమ్మతి సెగలు రావడంతో పార్టీ ప్లీనరీ సమావేశంలో రాజకీయాలంటే ఇష్టం లేదని, వయసు పైబడుతున్నందున ఎవరికి అధిష్టానం టికెట్ ఇచ్చిన మద్దతు తెలుపుతాను అని చెప్పడం కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. దీంతో నిర్మల్ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు పై చేయి సాధిస్తారు, ఎవరు ఓడుతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ప్రసన్నం చేసుకున్న వారే నిర్మల్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మంత్రిఅల్లోలకు టికెట్ డౌటేనా..!!? మంత్రి మాటల్లో మర్మమేంటి..!?

నిర్మల్ టిఆర్ఎస్ ప్రతినిధి సభలో మంత్రి మాట్లాడిన మాటలు కేసీఆర్ చేసిన వాక్యాలు బలం చేకూర్చినట్లేనా..!? మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతూ దళిత బందులో మూడు లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నారని, ఒక కోరు చిట్టా నా దగ్గర ఉందని చేసిన వాక్యాలు నిర్మల్ జిల్లాకు వర్తించినట్లేనా..? నిర్మల్ నియోజవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తగా తన పని చేస్తానని మంత్రి చేసిన వాక్యాలు వెనుక మర్మమేంటి..!! ఈసారి టిక్కెటు రాదని తేలిపోయిందా..? కార్యకర్తల మనసు తెలుసుకోవడానికి అలా మాట్లాడారా..? మంత్రి కంటి తడి వెనుక మర్మమేంటో..!? సొంత పార్టీలో అసమతి సెగలు కొనసాగడం మంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా..,!? ఎందుకు మంత్రికి ఇంత వ్యతిరేకం..! చేతులారా మంత్రి చేజార్చుకుంటుండా..!? అవుననే అంటున్నారు నాయకులు.కార్యకర్తలు.. మరి ఈసారి టికెట్ వస్తుందా ..!గోడ మీద పిల్లిలా కొనసాగుతున్న అసమ్మతి నాయకుడికి టికెట్ ఇస్తుందా.. ఎన్నికల వరకు వేచి చూడాలి.