Wednesday , July 24 2024

నింగికెగిసిన ప్రజాయుద్ధ నౌక ఉద్యమాలకే ఊపిరిగా గద్దర్.

ప్రజా గాయకుడు విప్లవాల పులిబిడ్డ గద్దర్ మృతి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి ఆగస్టు 6:

పలువురు కమ్యూనిస్టుల సంతాపం.

గత కొంతకాలంగా నారగంత బాధపడుతున్న గద్దర్ అపోలో ఆసుపత్రిలో చితకంతో ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం హైదరాబాదులోని అమీర్పేట్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ గద్దర్ చికిత్స విడిచారు ప్రజాయుద్ధం ఒక పేరుందన గద్దర్ పీపుల్స్ వార్ లోను అనంతరం మావోయిస్టు తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్లాదిమంది ఉత్తేజపరిచి వారి అభిమానాన్ని చురగొన్నాడు. గద్దర్ 1949 తప్రాన్ లో జన్మించాడు. ఆయన అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు తెలంగాణ ఉద్యమంలో శ్రీలంక పాత్ర పోషించారు తన పాటలతో మంచి ఊపు తెచ్చారు 1987లో కారంచేడు లో దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంత పోరాటం చేశారు నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6వ తేదీన గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. “అమ్మ తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా” పాటలతో ఉద్యమాలకు ఊపిరి తెచ్చిన గద్దర్ “నీ పాదం మీద పుట్టుమచ్చ నే చెల్లెమ్మ” అన్న పాటకు గద్దర్ కు నంది అవార్డు అందుకున్నారు.గద్దర్ స్వగ్రామం మెదక్ జిల్లా తుఫాన్ గ్రామం శేషయ్య దంపతులకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు గద్దర్ సొంతూరు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామం 1969 లో తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావవ్యప్తి కోసం ఊరురా తిరిగి ప్రచారం చేశారు ఇందుకోసం ఆయన బుర్రకథలు ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శన చూసిన సినిమా దర్శకులు బి బి.నరసింహారావు భగత్ సింగ్ జయంతి రోజు ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ప్రదర్శన ఇచ్చేవారు 1971లో బి నరసింగరావు ప్రోత్సాహంతో ఆపరా రిక్షా పాట రాశాడు. ఆయన మొదటి ఆల్బమ్ పేరు గద్దర్ ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్ కు భార్య పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి వెన్నెల ఒక అబ్బాయి సూర్యుడు ఉద్యమాలకు అనుబంధంగానే ఆ పేర్లు పెట్టుకున్నట్లు ఆయన ఒక బహిరంగ సభలో చెప్పాడు.

గద్దర్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పేరు ఆయన మరణం ప్రజా ఉద్యమానికి తీరనిలోటని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కమ్యూనిస్టు పార్టీ నాయకులు,పలువురు ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నేతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరారు.