Tuesday , July 16 2024

నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వా…నేనా.??

ఎమ్మెల్యే గా.. పక్క లోయపల్లి నర్సింగరావు…

ఈ సారి ఎమ్మెల్యే బరిలో నర్సింగరావు..

కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ప్రయత్నం…

గతం లో నర్సింగరావు పై కేసీఆర్ కన్ను…

సొంత పార్టీలో రెండు వర్గాలు…ఒకవైవు గోవర్ధనన్న సైన్యం,మరో వైపు సురేషన్న సైన్యం..

లోయపల్లి సొంత పార్టీ నుంచి పక్కకు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బె…

తెలంగాణ కెరటం, స్టేట్ ఇంచార్జ్:

లీడర్ కి మారు పేరు గా ప్రజలందరికీ ఆపద్బాంధవుడిగా పేరుపొందిన సీనియర్ రాజకీయ నాయకుడు
మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు అలియాస్ సురేషన్న ఎమ్మెల్యే కావాలని ఎప్పటి నుంచో కోరిక. అది బీఆరెస్‌ పార్టీలో సాధ్యపడటం లేదు.గత సాధారణ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సర్వే ప్రకారం కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కి నోచుకొకపోవడంతో బిఅరెస్ పార్టీ నుంచి గంప గోవర్ధన్ ఓడిపోయే పరిస్థితి ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కెసీఆర్ కన్ను లోయపల్లి నర్సింగరావు పై పడింది.లోయపల్లి నర్సింగరావు కి ఎమ్మెల్సీ గా టిక్కెట్ ఇస్తాం మని కేటీఆర్ హామీ ఇవ్వడంతో భారీ ఎత్తున్న తన అనుచరులతో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచుకున్నారు.

ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి…

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచినట్టే ఇచ్చి నామినేషన్‌ వేసే వరకు వెళ్లనిచ్చారు. చివరి వరకు వచ్చే సరికి నర్సింగ్‌రావును తప్పించి కవితకు ఎమ్మెల్సీని ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తిలో నర్సింగరావు, అతని అనుచరులు పడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూర దూరంగానే ఉంటూ వస్తున్నాడు.

సొంత పార్టీలో రెండు వర్గాలు…

ఒకవైపు గోవర్ధన్న సైన్యం,మరో వైపు సురేషన్న సైన్యం(నర్సింగరావు)అంటూ అనుచరులు వర్గాలు ఏర్పాటు చేసుకున్నారు.
దీనికి తోడు ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇద్దరి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది.

ఎమ్మెల్యే గా గెలవడానికి ముఖ్య సూత్రధారి..నర్సింగరావు
కానీ గత ఎన్నికల్లో గంప గోవర్ధన్ ఎమ్మెల్యే గా గెలవడానికి ముఖ్య కారణం లోయపల్లి నర్సింగరావునే అని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు అంటువుంటారు.నర్సింగరావు కంచుకోట అయినటువంటి మాచారెడ్డి మండలం నుంచి గత ఎన్నికల్లో బిఅరెఎస్ పార్టీకి అధిక ఓట్లు పొలవ్వడం తో ఎమ్మెల్యే గా గెలుపుపొందారు.

ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గ ను ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఈ ఎన్నికలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకే టిక్కెట్ ఇస్తే గెలవడం కష్టం అని ప్రజల గుసగుసలు.

పార్టీలో తగిన గుర్తింపు లేదు…

ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే.. నర్సింగ్‌రావును ఆహ్వానించలేదని, సమావేశం రోజున మొక్కుబడిగా రమ్మని ఫోన్‌ చేయడంతో తను రాలేదు. ఇది చర్చకు దారి తీసింది. బీఆరెస్‌ పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు, బాంధవ్యాలు ఉన్న నర్సింగరావు కి తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని చాలా రోజులుగా అసంతృప్తి, అసహనంతో ఉన్నాడు. ఇక తనకు పార్టీలో ఎలాంటి పదవులు రావనేది తేలిపోయింది. దీంతో వేరే పార్టీలలో కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నాడు. దీని కోసం బీఆరెస్‌తో ఉన్న అనుబంధాన్ని, బాంధవ్యాలను కూడా తెంచుకునేందుకు సిద్దపడ్డాడు.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మాచారెడ్డి మండలానికే పరిమితమైన తన రాజకీయాన్ని మెల్లగా నియోజకవర్గంలో పట్టుకోసం సమయం కేటాయిస్తున్నాడు. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న లోయపల్లి నర్సింగరావు ఎమ్మెల్యే కోసం ఈసారి గట్టిగానే ప్రయత్నం చేయాలని భావిస్తున్నాడు. దీని కోసంపార్టీ, సిద్దాంతం… బంధాలు అన్నింటినీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాడు.