వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ
రసకందాయంలో నిర్మల్ జిల్లా రాజకీయ సమీకరణాలు… రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. రాష్ట్రస్థాయి నేతగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పదవులు నిర్వర్తించిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఢిల్లీలో బిజెపి తెలంగాణ ఇన్చార్జి నాయకులు తరుణ్ చుగ్ తో మంతనాలు జరిపి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర బిజెపి చేరికల కమిటీ బాధ్యులు పీటల రాజేందర్ సమక్షంలో సాలువ కప్పుకొని ఏలేటి బిజెపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీ పొమ్మన్లేక పొగ పెట్టింది అని, ఏఐసిసి నాయకుడికి సోకాజ్ నోటీసులు జారీ చేయడం ఏంటది, దీనిపై సమాధానాన్ని ఇవ్వాలని బుధవారం రోజున ఏలేటి మీడియా సమావేశంలో టిపిసిసి నాయకులపై ధ్వజమెత్తారు. రేపటిలోగా సమాధానాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు నుండి ఎలాంటి జవాబు రాకపోగా, గురువారం రోజున ఏలేటి ఢిల్లీ బయలుదేరి బిజెపి తీర్థాన్ని పుచ్చుకున్నారు…
బలంగా నాటుకున్న సిద్ధాంతాలు మారుతాయా…
నాయకులు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలలో, ప్రజలలో బలంగా నాటుకున్న సిద్ధాంతాలు మారుతాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు… ఆది నుండి కాంగ్రెస్ పార్టీ , హస్తం గుర్తు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కార్యకర్తలు, ప్రజలు అంత త్వరగా తమ సిద్ధాంతాలను మార్చుకుంటారా అనే సందేహం వ్యక్తం అవుతుంది. నాయకులు ఎవరు ఉన్నా, ఎలాంటి సందర్భంలో అయినా సిద్ధాంతాలను బలంగా నాటుకున్న కార్యకర్తలు, ప్రజలు నాయకునివైపు వెల్లే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు.
మైండ్లో పాతికపోయిన హస్తాన్ని చెరిపేయగలరా..
స్వాతంత్రం వచ్చినప్పటినుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం కార్యకర్తలలో, ప్రజలలో ఒకరకంగా నాటుకు పోయిందని చెప్పవచ్చు. నాయకులు మారగానే వారి మైండ్లో పాతుకుపోయిన హస్తాన్ని చెరిపేయగలరా అనే అనుమానం వ్యక్తం అవుతుంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… పార్టీ మారిన నాయకుడు కార్యకర్తలను, ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి మైండ్లో పాతకపోయిన గుర్తును ఎంత త్వరగా చెరిపేస్తెనే గెలుపు అవకాశాలు ఉంటాయని అంటున్నారు…
మైనారిటీలు ఎటువైపు?
నిర్మల్ నియోజకవర్గంలో ఆది నుండి పట్టణానికి చెందిన ఎక్కువ శాతం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నవారే… కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మైనారిటీలు పూర్తి మద్దతును ఇస్తూ వస్తున్నారు… కాగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారడంతో మైనారిటీలు ఎటువైపు నడుస్తారో చూడాలి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…
ఏలేటి బిజెపికి… బిఆర్ఎస్ అనుకూలం కానుందా…?
ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి బిజెపిలోకి చేరడంతో ఎంత లాభం ఉందో, అంతే నష్టాన్ని కూడా భరించాల్సి వస్తుందని పలువురు అంటున్నారు… ఏలేటి బిజెపిలోకి చేరడం టిఆర్ఎస్ కు అనుకూలం అని, మంత్రి అల్లోల గెలుపుకు బీజం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు, మైనారిటీలు , బిజెపి వ్యతిరేకులు బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, ఇన్ని రోజులు బిజెపిలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కొందరు నాయకులు తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో మంత్రి అల్లోల వచ్చే ఎన్నికలలో అనుకూలంగా మార్చుకుంటారని పలువురు చర్చించుకుంటున్నారు…
ఏది ఏమైనా ఎన్నికలకు ముందే నిర్మల్ జిల్లా కేంద్రంలో రాజకీయ వేడి పులుముకుంది.