Wednesday , July 24 2024

నర్సన్నపేట లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామoలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మర్కుక్ మండల ఎమ్మార్వో ,మర్కుక్ మండల ఎంపీడీవో ప్రవీణ్,స్థానిక సర్పంచ్ మాధవి రాజిరెడ్డి,మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత.వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి చేరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు.నర్సన్నపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమం మంగళవారం రోజు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలను రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి చేకూరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కానుగంటి నారంరెడ్డి, ఉడేం బాల్ రెడ్డి, బూకల శ్రీశైలం, నీరు గంటి మల్లేశం, రెడ్డమైన పెంటయ్య, తిరుపతి ఉడెo బాల్ రెడ్డి,గిలుక గణేష్, కిష్టయ్య, చేకటి సాయిబాబా,నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.