Monday , July 22 2024

కామ్రేడ్ నారాయణ రెడ్డి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి

గజ్వేల్ నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మర్కుక్ మండలం అంగడి కిష్టపూర్ గ్రామ సర్పంచ్ గా 1984 నుంచి 1989 ఒక పర్యాయకాలం పని చేశాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీకి మరవలేని సేవలందించినటువంటి కీ”శే కామ్రేడ్ కొంరెడ్డి నారాయణ రెడ్డి బుధవారం ఉదయం 04:30 గంటలకు మరణించడం జరిగింది. ఆయన మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు అని గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి శివలింగ కృష్ణ అన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు తొందురు నరసింహారెడ్డి నారాయణ రెడ్డి కి సి పి ఐ పార్టీ కండువా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఎల్లారెడ్డి, బిక్షపతి, కొడుతుల లింగం, బాల్ రెడ్డి, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.